విశాలాంధ్ర -ధర్మవరం : వ్యాపారస్తుల అభివృద్దే మా ధ్యాయమని ధర్మవరం పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని సెమినారాయణా స్వామి గుడిలో ధర్మవరం వ్యాపారస్తులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిర్రాజ రవి మాట్లాడుతూ వ్యాపారస్తులందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ, వ్యాపారాల్లో వచ్చిన లావాదేవీలను కూడా ఐక్యమత్యంతో పోరాడేందుకే ఈ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే గత కొన్ని నెలలుగా ధర్మవరం పట్టు వ్యాపారస్తులకు నగరాలలో రావలసిన బకాయి 100 కోట్లను వసూలు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకనూ నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు వివిధ నగరాల నుండి రావలసి ఉన్నదని, వాటిని కూడా వసూలు చేసేందుకు సంఘం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. 2019 వ సంవత్సరములో కల బకాయిలను కూడా అక్కడి వ్యాపారస్తులతో మాట్లాడి అసోసియేషన్ ద్వారా తప్పక ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అక్టోబర్ నెలలో అఖిలభారత వ్యాపారస్తుల అసోసియేషన్ కమిటీ ద్వారా ధర్మవరం వ్యాపారస్తులు దాదాపు 800 మంది సమావేశాన్ని నిర్వహించి, వ్యాపారస్తుల యొక్క కష్టనష్టాలను పై కార్య చరణ ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. ఇలా చేయడం వల్ల వ్యాపారస్తులకు మేలు జరుగుతుందని తెలిపారు. అనంతరం పట్టుసాలే సంఘం వారు, సెమినారాయన స్వామి ఆలయ కమిటీ వారు ధర్మవరం పట్టుచీరల తయారీ వ్యాపారస్తుల సంఘం చేసిన కృషిని అభినందించి కార్యవర్గ సభ్యులు అందరినీ కూడా పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గిర్రాజు రవితోపాటు గౌరవ అధ్యక్షులు కలవల రామకుమార్, పోలా వెంకటనారాయణ, ఉపాధ్యక్షులు పోలా ప్రభాకర్, రంగం ఆది, తవి సల నాగభూషణం, కార్యదర్శి- బెస్త సాంబశివ (దత్త శివ), సహకార్య దర్శులు- కోటం హేమంత్ కుమార్, నీలూరి శ్రీనివాసులు, కోశాధికారి కలవల మురళీధర్, డైరెక్టర్లు బండారు శ్రీనివాసులు, బంధనాదం శశిభూషణ, గాండ్ల రామాంజనేయులు, పల్లా నవీన్ కుమార్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.