గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై ఆరా… పలు సూచనలు జారీ
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : జిల్లాలోని గార్లదిన్నె పోలీసు స్టేషన్ ను ఈరోజు జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాలను సందర్శించి పోలీసుస్టేషన్ నిర్వహణ మరియు రికార్డుల నిర్వహణపై లోతుగా పరిశీలించారు. రిసెప్సన్ సెంటర్, లాకప్ గదులను పరిశీలించి పోలీసు స్టేషన్లకు వచ్చే పిటీషనర్ల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, అనవసరంగా ఎవర్నీ పోలీసు స్టేషన్లకు పిలిపించడం చేయరాదని సూచించారు. విధుల్లో భాగంగా పోలీసులు మెయింటేన్ చేసే ప్రతీ రికార్డును సమీక్షించారు. అనంతరం పోలీసు స్టేషన్ ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని పరిస్థితులను ఎస్సైలను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని గణేష్ నిమజ్జనం, బందోబస్తు ఏర్పాట్లపై ఆరా తీసి పలు సూచనలు జారీ చేశారు. శాంతిభధ్రతల పరిరక్షణ, మహిళా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇసుక… మట్కా, గుట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్, నాటు సారా తయారీ డ అమ్మకం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు గట్టిగా పని చేయాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన తీసుకురావాలన్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కారం చేయాలని అక్కడే అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్పీ తనిఖీల్లో శింగనమల సి.ఐ అస్రార్ బాషా, గార్లదిన్నె ఎస్సై సాగర్ లు ఉన్నారు.