Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

భవిష్యత్తుకు గ్యారెంటీ బాబుతోనే

విశాలాంధ్ర, పెద్దకడబూరు : రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ టీడీపీ అధినేత చంద్రబాబుతోనే సాధ్యమని మంత్రాలయం టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి, టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి భరోసా ఇచ్చారు. గురువారం మండల పరిధిలోని కంబదహాల్, జాలవాడి, కంబలదిన్నె గ్రామాల్లో భవిష్యత్తుకు బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని టిడిపి మండల అధ్యక్షులు బసలదొడ్డి ఈరన్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి, రమాకాంతరెడ్డి మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఆరు సంక్షేమ పథకాలు గురించి, వాటి లబ్ధి గురించి వివరించారు. మహాశక్తి ద్వారా తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు, ఆడబిడ్డ నిధి నుంచి 18 ఏళ్లు పైబడిన స్త్రీలకు నెల రూ. 1500, దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, అన్నదాత పథకం ద్వారా ప్రతి రైతుకు రూ. 20 వేలు సాయం అందిస్తారని తెలిపారు. యువగళం పేరుతో 20 లక్షల మంది యువతకు ఉపాధి, నిరుద్యోగులకు యువగళం నిధి నుంచి నెలకు రూ. 3వేలు నిరుద్యోగ భృతి, బీసీలకు రక్షణ చట్టం, ఇంటింటికి రక్షిత మంచినీటి పథకం, పేదలను సంపన్నులను చేసే పథకాలను చంద్రబాబు అమలు చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబురావు, మల్లికార్జున, దశరథరాముడు, మీసేవ ఆంజనేయ, అంజి,నరసన్న, మల్దకల్, నరసప్ప, మురళి, మునెప్ప, తిమ్మప్ప, ముక్కన్న, మునిస్వామి, కంబగిరి, భీమరాయుడు, శ్రీనివాసులు, తాయప్ప, వెంకటరామిరెడ్డి, రాముడు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img