Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చేనేతల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

టిడిపి నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం:: చేనేతల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టిడిపి నాయకులు టిడిపి రాష్ట్ర కార్యదర్శి కమతం కాటమయ్య హిందూపురం పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి పురుషోత్తం గౌడ్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు సోమవారం వారు పట్టణ చేనేత అనుబంధ విభాగాలు నాయకులు కు సమావేశం ను నిర్వహించి, అనంతరం మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలైనా చేనేతల సమస్యలను పరిష్కరించలేకపోవడం దారుణం అన్నారు. చేనేత సమస్యలపై టిడిపి నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. టిడిపి హయాంలో చేనేతలకు పలు పథకాలతో అభివృద్ధిని సాధించడం జరిగిందని, నేడు చేనేత పరిశ్రమ నిర్వీర్మైందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టు ముడి సరుకులు పెరుగుట, కరోనా దెబ్బకు కూడా చేనేతలు ఎన్నో కష్టాల పాలయ్యారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఇవ్వాల్సిన 5 లక్షల ఎక్స్గ్రేషియా విడుదల జాప్యంపై ప్రభుత్వంతో పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పని కుమార్, షీలా మూర్తి, చట్టా లక్ష్మీనారాయణ, కృష్ణాపురం జమీర్ అహ్మద్, మారుతి స్వామి, బిబీ, చీమల రామాంజి, గడ్డం సూరి ,తోట వాసుదేవా, చెలిమి శివరాం, తొగట నారాయణస్వామి, కాశప్ప, మండల సురేష్, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు అన్నదానం:: పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నింపుతామని, నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ సూచనలు మేరకు సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు వివిధ గ్రామాల నుండి వారపు సంతకు వచ్చే ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని, నాయకులు పురుషోత్తం గౌడ్, పరిసే సుధాకర్, తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని వైయస్సార్సీపి ప్రభుత్వం లూటీ చేయడమే కాకుండా పేదవాడి కడుపుకు పట్టణం పెట్టడానికి కూడా శ్రద్ధ చూపలేకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బిలే సీనా, రాయపాటి శివ, బొట్టు కృష్ణ, చట్ట నారాయణస్వామి, కృష్ణాపురం జమీర్ అహ్మద్ మారుతి స్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img