Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు… మాసపల్లి సాయికుమార్, చందమూరి నారాయణరెడ్డి


విశాలాంధ్ర – ధర్మవరం : తల్లి బిడ్డల ఆరోగ్యానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మున్సిపల్ వైస్ చైర్మన్లు మాసపల్లి సాయికుమార్, చందమూరి నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా గురువారం 9వ వార్డులో చిన్నూరు అంగన్వాడి సెంటర్లో వైయస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో గర్భిణీలకు, బాలింతలకు, అదేవిధంగా మారుతీ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో నూ వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమంలో భాగంగా హోం రేషన్ పంపిణీని నిర్వహించారు. అనంతరం మాజీ వైస్ చైర్మన్లు మాట్లాడుతూ బాలింతలు గర్భవతుల వద్దకే ప్రభుత్వం టేక్ హోమ్ రేషన్ సరుకులు ఇవ్వడం నిజంగా సంతోషకరమైన, అభినందనీయమైనదని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ఇటువంటి సౌకర్యం కల్పించడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో ఇచ్చే పౌష్టిక ఆహారం రక్తహీనతను లేకుండా చేస్తుందని, ఆరోగ్య ప్రాయంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత అధ్యక్షులు జింక కంబగిరి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img