Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

మరణంలేని మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి

జెడ్పిటీసీ ఇంటూరి భారతి

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : పేదప్రజలకోసం ఎన్నో సంక్షేమపథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో సిరస్ధాయిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో మరణం లేని మహానాయకుడు అయ్యారని జెడ్పిటీసీ ఇంటూరి భారతి అన్నారు. శనివారం మండలంలోని వలేటివారిపాలెంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతిసందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరైనారు ఈ సందర్బంగా తొలుతగా వైసీపీ మండలమీడియా అధికారప్రతినిధి పరిటాల వీరాస్వామి,చుండి సచివాలయకన్వీనర్ ఇరుపని అంజయ్య,అయ్యవారిపల్లి సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు,వైసీపీ యువనాయకులు యాళ్ల శివకుమార్ రెడ్డి,వైసీపీ సీనియర్ నాయకులు నలమోతు చంద్రమౌళి,కాకు వెంకటస్వామి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పక్షపాతి, రైతు పక్షపాతి అయిన దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్.రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజలకు అందించిన సేవలు అనిర్వచనీయమని అన్నారు మహానాయకుడు రాజశేఖర రెడ్డి తెలుగు ప్రజల కోసం అహార్నిశలు శ్రమించారని, అనేక సంక్షేమ పధకాలను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. రాజశేఖర రెడ్డి స్వతగా వైద్యులు కావడంతో విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి సారించారని,108 వంటి అద్భుతాన్ని ఆవిష్కరించారని అన్నారు. అలాగే అన్నదాతల కష్టాన్ని గుర్తించి, వారికి సేవలు అందిస్తూ రైతు పక్షపాతి అయ్యారని అన్నారు. అందుకే ఆయన పుట్టినరోజునే రైతు దినోత్సవంగా ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి ప్రకటించి, రైతులకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. అనంతరం జెడ్పిటీసీ ఇంటూరి భారతి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి అంటేనే సంక్షేమం గుర్తుకు వస్తుందని అన్నారు. ఆయన మృతి చెంది 14 ఏళ్లు కావస్తున్నా, ఆయన తెలుగు రాష్ట్రాల అభివృద్దికి, తెలుగు ప్రజల సంక్షేమానికి చేసిన కృషి వల్ల తెలుగు ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా నిలిచిపోయారన్నారు. రాజశేఖర్ రెడ్డి గఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆ మహనీయుని తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి . వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తూ గాంధీజి కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు అందించేందుకు సచివాలయ వ్యవస్ధను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు.అనంతరం భారీ కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి పెట్టారు కార్యక్రమంలో ఎంపీపీ పొనుగోటి మౌనిక, వైసీపీ మండల జేసీఎస్ కన్వీనర్ అనుమోలు వెంకటేశ్వర్లు, వైసీపీ సీనియర్ నాయకులు ఇంటూరి హరిబాబు, సర్పంచ్ లు ఇరుపని సతీష్,చెన్నెబోయిన ఓబులు కొండయ్య,వింజం వెంకటేశ్వర్లు, చుండి ఎంపీటీసీ చౌడబోయిన యానాది,వైసీపీ నాయకులు యాళ్ల హరిబ్రహ్మ రెడ్డి, యాళ్ల కిషోర్ రెడ్డి,కట్టా హనుమంతురావు,కుంబాల క్రాంతి,నాగిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి, గురిజాల క్రిష్టయ్య,వరికూటిసంజీవి రెడ్డి,అనుమోలు వెంకటస్వామి,బొమ్మిరెడ్డి తిరుపతి రెడ్డి,నవులూరి హజరత్తయ్య,మద్దులూరి కొండలరావు,ఎల్ఐ సీ మాల్యాద్రి,పర్రె జగదీష్,లింగాబత్తిన మాల్యాద్రి,దామా వెంకటేశ్వర్లు,నత్తా బాబూరావు,గడ్డం మాధవరావు,అనుమోలు లక్ష్మినరసింహం,వైఎస్సార్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img