ఏఐఎస్ఎఫ్ ,ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎ పిడిఎస్యు నిరసన
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడాన్ని ఖండిస్తూ ఏఐఎస్ఎఫ్ ,ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ ,పిడిఎస్యు ఆధ్వర్యంలో నిరసన సోమవారం కార్యక్రమం చేపట్టారు. అనంతరం పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, ఏఐఎస్ఎ యూనివర్సిటీ కార్యదర్శి రాజు నాయక్ ,పిడిఎస్యు నగర అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం అనేది రాజకీయాలకు అతీతంగా ఉండాలి. నేడు అధికార పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే రేపటి రోజున ప్రభుత్వం మారితే మరొక పార్టీ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేస్తారని అన్నారు.వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పెట్టడం కేవలం తన వైస్ చాన్సులర్ పదవి కాపాడుకోవడం కోసమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొంది తన పదవి కాలం ముగిస్తుండడంతో దాన్ని పొడిగించుకోవడం కోసమే విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టడం జరుగుతుందని మండిపడ్డారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎలా చేరాలి యూనివర్సిటీ ఎలా అభివృద్ధి చెందాలి దానిపైన ఆలోచించాల్సిన వైస్ ఛాన్స్లర్ ఇలా రాజకీయ నాయకులు విగ్రహాలు ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల దగ్గర మెప్పు పొందడం కోసం ఇలాంటి పనులు చేయడం సరైనది కాదని మండిపడ్డారు. యూనివర్సిటీలో వైస్ ఛాన్స్లర్ పదవి చేపట్టినప్పటి నుంచి యూనివర్సిటీని పూర్తిగా బ్రష్టు పట్టించారని మండిపడ్డారు గతంలో యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ మూసివేయాలని యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం నిర్వహించాలని యూనివర్సిటీలో ఎంఏ అడల్ట్ ఎడ్యుకేషన్ కోర్సును మూసివేయాలని ఇలా విద్యార్థి వ్యతిరేక మూఢనమ్మకాల నిర్ణయాలు తీసుకున్న వైస్ ఛాన్స్లర్ రామకృష్ణారెడ్డి కి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తే ఆ మూడు కార్యక్రమాలను వెనక్కి తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఒకవేళ యూనివర్సిటీలో విగ్రహాలు ఏర్పాటు చేయాలని మీకు అంత ప్రేమ ఉంటే దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరయోధులు ఈ జిల్లాలో చాలామంది ఉన్నారు.. వారి విగ్రహాలు ఏర్పాటు చేయవచ్చు . విశ్వవిద్యాలయం ఆవరణలో రాజకీయ నాయకుల విగ్రహాలు పెడితే వామపక్ష విద్యార్థి సంఘాలుగా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వంశీ ,నాయకులు హరిక్రిష్ణ నారాయణస్వామి, ఆనంద్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గిరి నాయకులు శివ బందీశ్ తదితరులు పాల్గొన్నారు.
01.. నిరసనను తెలియజేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు..
02.. విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు..
