విశాలాంధ్ర – పార్వతీపురం :పార్వతీపురం మన్యం జిల్లానుండి నాలుగు పాఠశాలలు రాష్ట్ర ప్రతిభా అవార్డులకు ఎంపిక కావడంపట్ల పార్వతీపురం మన్యంజిల్లా మండలవిద్యాశాఖ అధికారుల సంఘం హర్షం వ్యక్తంచేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు సామల సింహాచలం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ నాగభూషణరావు,గౌరవ అధ్యక్షులు నారాయణస్వామి ఉపాధ్యక్షులు ఎం వెంకటరమణలు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రస్థాయిలో10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల సీతంపేట, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జియ్యమ్మవలస,భద్రగిరి ఏపీ బాలికల గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్,రేగులపాడు కేజీబీవీ పాఠశాలలు రాష్ట్రస్థాయిఅవార్డులకు ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమన్నారు. రాష్ట్రస్థాయిలో ఎనిమిది పాఠశాలలను ఎంపిక చేయగా, అందులో నాలుగు పాఠశాలలు మన్యం జిల్లా నుండి ఎంపిక కావడం చాలా గొప్పవిషయమన్నారు. ఉత్తమ పాఠశాలలుగా ఎంపిక కావడానికి కృషిచేసిన ఆయాపాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బందికి ఎంఈఓల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని సామల సింహాచలం తెలిపారు.