16వ వార్డు కౌన్సిలర్ కేత లోకేష్
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వము యొక్క లక్ష్యమని 16వ వార్డు కౌన్సిలర్ కేత లోకేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా “మా నమ్మకం- నీవే జగన్” అనే కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ప్రభుత్వము యొక్క పనితీరుపై ప్రజాభిప్రాయ సేకరణ కొరకు 16వ వార్డులో వారు పర్యటించారు. అనంతరం కేత లోకేష్ ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వం యొక్క ప్రజా సంక్షేమ పథకాలు పై వారు ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వార్డులు అభివృద్ధి చెందుతున్నాయని వారు తెలిపారు. సమస్యలను పరిష్కరించడానికి నేటి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. సచివాలయ వ్యవస్థల ద్వారా ఎన్నో సమస్యలను పరిష్కరించడం జరిగిందని, ఈ ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే కేతిరెడ్డి దేనిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కన్వీనర్లు పోలా శ్రీనివాసులు, గుద్దటి నారాయణస్వామి, పామిశెట్టి తిరుపతయ్య, ఆర్పి గంగాభవాని, గృహ సారధులు, వాలంటీర్లు పాల్గొన్నారు.