Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

సమస్యల పరిష్కారమే విద్యుత్ అదాలత్ లక్ష్యం

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపి

విశాలాంధ్ర – ధర్మవరం : వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే విద్యుత్ ప్రత్యేక అదాలత్ లక్ష్యమని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోపి, చైర్ పర్సన్ రామ్మోహన్రావు, టెక్నికల్ సభ్యులు అంజని కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని బత్తలపల్లి రోడ్డు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ప్రత్యేక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ అధికారులు మాట్లాడుతూ ధర్మవరం పట్టణము, రూరల్ పరిధి నుండి ఎనిమిది మంది వినియోగదారులు పాల్గొనడం జరిగింది. ఇందులో మూడు ఫిర్యాదులు అప్పటికప్పుడే పరిష్కరించగా, మిగిలిన ఐదు ఫిర్యాదులను సంబంధిత అధికారుల ద్వారా ఇచ్చిన షెడ్యూల్ తేదీ ప్రకారం పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులకు విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఎదురయ్యే సేవలోపాలను సత్వరమే పరిష్కరించి త్వరితగతిన న్యాయం చేకూర్చుతామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూల్, అనంతపురం ఉమ్మడి జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికను నిర్వహించడం జరుగుతుందన్నారు. నిర్దేశిత సేవలు లో భాగంగా విద్యుత్ తీగల మరమ్మత్తులు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తులు, కాలిపోయిన వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చుట, విద్యుత్ సరఫరా నిలిపివేతకు కాలపరిమితి, సబ్ స్టేషన్ల నిర్మాణము, విద్యుత్ ఓల్టేజీ హెచ్చుతగ్గులు, విద్యుత్ మీటర్లు లోపాలకు సంబంధించిన విషయాలు, కేటగిరి, ఇతర మార్పిడి అంశాలు, వినియోగదారుల బిల్లులలో లోపాలను సరి చేయుట, తదితర విషయాలకు ఇచ్చిన గడువులోగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టౌను రూరల్ ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img