ఎమ్మెల్యే జోగారావు
విశాలాంధ్ర,పార్వతీపురం: శాసన సభలో సభ్యులందరి సమక్షంలో రాజ్యాంగ నిర్మాత, మహోన్నత వ్యక్తి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గూర్చి తనకుమాట్లాడే అవకాశంలభించడం ఒక దళితఎమ్మెల్యేగా ఎంతోగర్వకారణంగా ఉందని పార్వతిపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు తెలిపారు.గురువారం శాసనసభ బడ్జెట్ సమావేశంలో ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గూర్చి మాట్లడుతూ ఆయన విగ్రహం అంటే
దేశ దళిత ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా నిలుస్తుందన్నారు .
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శృతివనం కట్టిస్తామని చెప్పి మోసం చేసింది గత టీడీపీ ప్రభుత్వమైతే, ఇచ్చిన మాట ప్రకారం శృతివనం వైసీపీ ప్రభుత్వం కట్టిస్తుందన్నారు.రాష్ట్రంలో ఇంతవరకు కనీవినీ ఎరుకని ఏప్రభుత్వము చేయని విధంగా దళితులకు అధిక ప్రాధాన్యత నిస్తూ ముందుకు తీసుకువెళుతున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమన్నారు.
ప్రపంచ దేశాలలో యావత్ భారత దేశ ఖ్యాతిని పెంపొందించిన మహానుభావులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ప్రపంచంలోని ఏడుగురు అత్యుత్తమ వ్యక్తులలో ఒకరుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలిచారని కొనియాడారు.ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచ నాలెడ్జ్ డే గా ఐక్యరాజ్యసమితి గుర్తించడం ఆయన ఖ్యాతికి నిదర్శనమన్నారు.
ప్రపంచంలో ఏవ్యక్తికి లేనన్ని విగ్రహాలు అంబేద్కర్ కు ఉండటం వల్ల ఆయన గొప్పతనం ఏమిటో అందరికీ తెలుసు
న్నారు.అమెరికాలో 68, జపాన్లో 49, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 78వేల విగ్రహాలు ఉండగా మహారాష్ట్రలో 37వేలవిగ్రహాలు ఉన్నాయని చెప్పారు. భారత దేశానికి రాజ్యాంగాన్ని రచన చేసిన అటువంటి మహనీయుడు అంబేడ్కర్ గొప్పతనాన్ని,ఖ్యాతిని,ఔన్నత్యమును చట్టసభలో చెప్పేఅవకాశం తనకు ఇచ్చిన రాష్ట్ ముఖ్యమంత్రికి, శాసనసభ స్పీకర్ కు, శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.