పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర – ధర్మవరం : నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం టిడిపి కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశాన్ని వారు నిర్వహించారు. అనంతరం పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ నారా లోకేష్ కి ధర్మవరం ఎప్పుడూ గుర్తింపు ఉండేలా పాదయాత్రను విజయవంతం చేయాలని, ఇందుకు అందరూ కూడా సైనికుల్ల పని చేయాలని వారు తెలిపారు. ధర్మవరంలో దౌర్జన్యం పై యుద్ధానికి సిద్ధం కావాలని, మీతో పాటు నేను కూడా అన్నివేళలా అండగా ఉంటూ, సైనికుడిగా తాను పనిచేస్తానని తెలిపారు. నేడు ప్రజలందరూ కూడా మూడు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనలో విసుగు చెందారని, టిడిపి వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ చేపట్టిన పాదయాత్ర ధర్మవరం నియోజకవర్గంలో మూడు రోజులు పాటు సాగుతుందన్నారు. ఈ పాదయాత్రకు నియోజకవర్గంలోని ప్రతివాడు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చేలా టిడిపి శ్రేణులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నియోజకవర్గ సమస్యలను కూడా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్తే భవిష్యత్తులో పరిష్కారం అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. ధర్మవరంలో కనివిని ఎరుగని రీతిలో ఈ పాదయాత్ర సాగాలని వారు పిలుపునిచ్చారు. ధర్మవరంలో కార్యకర్తలు ఎన్ని కష్టాలు వచ్చినా, పార్టీని వీడలేదని, ఇక్కడున్నంత బలమైన కార్యకర్తలు రాష్ట్రంలో ఎక్కడ లేరని వారు గుర్తు చేశారు. ధర్మవరంలో మనము ఒక రాక్షసునితో పోరాడుతున్నామని, సైనికుల్లా మనం పని చేస్తే నే విజయం లభిస్తుందని తెలిపారు. త్వరలోనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు, టిడిపి పార్టీలో చేరనున్నారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కమతం కాటమయ్య, చింతలపల్లి మహేష్ చౌదరి, పని కుమార్, బోయ రవిచంద్ర, కూనుతురు వేణుగోపాలరెడ్డి, పురుషోత్తం గౌడ్, పోతుకుంట లక్ష్మన్న, కాచర్ల కంచన్న, కృష్ణాపురం జమీర్ అహ్మద్, మారుతి స్వామి, కరణం ప్రభాకర్, సాహెబ్బి, మేకల రామాంజనేయులు, గడ్డం కుళ్లాయప్ప, బిబి, గొట్లూరు శీన, దేవరకొండ రామకృష్ణ, సీనా, పటాన్ బాబు ఖాన్, అంబటి సనత్, రాళ్లపల్లి షరీఫ్, చిత్ర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.