విశాలాంధ్ర-శింగనమల : రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత విధానాలకు స్వస్తి పలకాలని, పోలీసుల అక్రమ అరెస్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టి నారాయణస్వామి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చెన్నప్ప యాదవ్ సిపిఐ శింగనమల మండల కార్యదర్శి తరిమెల రామాంజనేయులు గురువారం శింగనమల మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్న శిబిరానికి వెళ్లి సిపిఐ ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలకుభావ స్వేచ్ఛ ప్రకటనకు విఘాతం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలంబిస్తుందన్నారు. జరిగిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పై తీసుకున్న విధానాలను ప్రజలకు తెలియ చేస్తే, అక్రమ కేసులు పెట్టి, భయానకాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే విధంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మోసపూరిత పరిపాలన కొనసాగుతోందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మధు యాదవ్ చేనేత కార్మిక సంఘం మండల కార్యదర్శినేసే మధు , లక్ష్మి రంగయ్య, ఓబి రెడ్డి, సిపిఐ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.