Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

24 గంటలు గడవకనే ముగ్గురు విద్యార్థుల మిస్సింగు కేసును ఛేదించిన పోలీసులు

బుక్కరాయసముద్రం సి.ఐ ఆధ్వర్యంలో మూడు బృందాలతో గాలింపు

కర్నూలు రైల్వే స్టేషన్లో వెతికి పట్టుకున్న పోలీసు బృందాలు

పోలీసు బృందాలను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : 24 గంటలు గడవకనే ముగ్గురు విద్యార్థుల మిస్సింగు కేసును బుక్కరాయ సముద్రం పోలీసులు ఛేదించారు. వివరాలు…బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని వడియం పేట గ్రామంలో సమీపంలో ఉన్న కేశవరెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల నుంచి9 వ తరగతి చదివే ముగ్గురు విద్యార్థులు స్కూలు టీచర్లకు లేదా యాజమాన్యంకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయారు. స్కూల్ యాజమాన్యం బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేశారు. బుక్కరాయ సముద్రం సి.ఐ నాగార్జునరెడ్డి వెంటనే కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ముగ్గురు విద్యార్థుల ఆచూకీ కోసం మూడు ప్రత్యేక పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి పర్యవేక్షణలో మూడు బృందాలు జిల్లాలోనే కాకుండా పొరుగు జిల్లాలలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా… మీడియా మరియు పోలీసు గ్రూపుల్లో విద్యార్థుల ఆచూకీ కోసం పోస్టులు పెట్టి అప్రమత్తం చేశారు. ఈనేపథ్యంలో కర్నూలు రైల్వే స్టేషన్లో ఉన్న సదరు ముగ్గురు విద్యార్థులను ఆచూకీ కనుగొని పట్టుకున్నారు. 24 గంటలు గడవకనే విద్యార్థుల మిస్సింగు కేసు ఛేదింపులో శ్రమించిన సి.ఐ నాగార్జునరూడ్డి, ఎస్సై శ్రీనివాస్ మరియు పోలీసు బృందాలను జిల్లా ఎస్పీ శ్రీ కె.శ్రీనివాసరావు అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img