Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మన తెలుగుజాతి గర్వించ బిడ్డ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు..

గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర- ధర్మవరం : మన తెలుగుజాతి గర్వించదగ్గ బిడ్డ, మన్యం వీరుడు, అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లో అందరూ నడవాలని, గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల గ్రంథాలయ ప్రధాన శాఖలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పాఠకుల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి అంజలి సౌభాగ్యవతి మాట్లాడుతూ తెల్లదొరల కబంధ హస్తాల నుంచి మన దేశానికి స్వాతంత్రం తెప్పించడానికి అల్లూరి ప్రాణమును కూడా పణంగా పెట్టిన మహనీయ వ్యక్తి అని తెలిపారు. ఈరోజు వారిని స్మరించుకోవడం మన అందరి బాధ్యత అని వారు తెలిపారు. తదుపరి అల్లూరి సీతారామరాజు దేశానికి చేసిన సేవలు, ప్రజలకు దేశభక్తిని వివరించిన వైనం వారు పాఠకులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సత్యనారాయణ, శివమ్మ, రమణా నాయక్, గంగాధర్, గ్రంథాలయ పాఠకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img