విశాలాంధ్ర -ధర్మవరం : పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఆధారపడి ఉందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని గుట్ట కింద పల్లెలో గల కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఁప్రపంచ పర్యావరణ దినోత్సవంఁను సోమవారం ప్రిన్సిపాల్ అధ్యక్షతన విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణములలో మొక్కలను నాటారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ 1973 జూన్ 5వ తేదీ నుంచి పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆధునిక సమాజంలో మనం ఎన్నో మార్పులు చూస్తున్నామని ప్లాస్టిక్ వస్తువులను నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడడానికి అంతర్జాతీయ జాతీయ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు చేసి ,పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారని తెలిపారు. నీరు, గాలి, వివిధ వాహనాలలో వాడే ఆయిల్ శబ్ద కాలుష్యాలను తగ్గించడానికి సహజ వనరులను మోతాదులో వాడుకొని మొక్కలను పెంచి పర్యావరణాన్ని పెంపొందించాలని ప్రతి ఒక్కరూ పుట్టినరోజు పెళ్లిరోజు తో పాటు ఏ ఇతర కార్యక్రమాలలోనూ మొక్కలను అందించి, వాటిని నాటే కార్యక్రమాన్ని అందరూ అలవాటు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో డా॥ ఎస్, షమీఉల్లా, ఎస్.పావని, టి. రామ్ మోహన్ రెడ్డి, యం. పుష్పావతి, బి.ఆనంద్, వై.స్వామి… తదితరా అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.