Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఓటు హక్కు మన చేతిలో వజ్రాయుధం

ఓటు హక్కు తోనే దేశ ప్రగతి సాధ్యం
18 సంవత్సరాల నుండి ప్రతి యువత ఓటు హక్కు కలిగి ఉండాలి
రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మధుసూదన్

విశాలాంధ్ర అనంతపురం వైద్యం
ఓటు హక్కు పై యువత కు చైతన్యం కలిగించేందుకు , 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును రిజిస్టర్ చేయించుకునేందుకు అవగాహన కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ మధుసూదన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా స్వీప్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్డిఓ మధుసూదన్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరు విధిగా ఓటు హక్కును రిజిస్టర్ చేయించుకోవాలని, ఓటు హక్కు మన చేతిలోని వజ్రాయుధమని, మన ఓటు హక్కుతోనే మంచి నాయకులను, సమాజ సేవకులను మనల్ని పరిపాలించే నాయకులుగా మలుచుకోవడానికి అద్భుత అవకాశం ఉంటుందని, మంచి నాయకులను ఎన్నుకోవడం ద్వారానే సమాజ అభివృద్ధి తద్వారా దేశ పురోగతి జరుగుతుందని తెలిపారు. డబ్బు తీసుకుని ఓట్లు వేయడం వలన ఓటుకు ఉండే విలువను మనం కాపాడుకోలేకపోతున్నామని దీనిపై మెడికల్ విద్యార్థులు ప్రజలలో అవగాహన తీసుకుని వచ్చి ఎన్నికల ప్రణాళిక నియమబద్ధంగా నిజాయితీగా జరిగేలా సహకరించేందుకు తోడ్పడాలని తెలిపారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ మైరెడ్డి నీరజ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు విధిగా తమ ఓటు హక్కును రిజిస్టర్ చేయించుకుని ఎన్నికలలో మన ఓటు హక్కును విధిగా ఉపయోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని తెలిపారు.
కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ దివాకర్ రావు ఓటు హక్కు ఏ విధంగా మొబైల్ ఫోన్లో మరియు పత్రాలలో ఏ విధంగా రిజిస్టర్ చేయించుకోవాలో సోదాహరణంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల వాటర్ ఎవేర్నెస్ కార్యక్రమం సమన్వయ అధికారి ఎస్ పి ఎం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ తెలుగు మధుసూదన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, జిల్లా స్వీప్ సిబ్బంది,2022 బ్యాచ్ జూనియర్ డాక్టర్లు, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img