విశాలాంధ- జేఎన్టీయూఏ: ఎందరో అమరవీరుల త్యాగఫలం నేడు స్వాతంత్ర దినోత్సవ జరుపుకుంటున్నామని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య సుదర్శన్ రావు పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఇంజనీరింగ్ కళాశాల ఆవరణంలో జెండాను ఆవిష్కరించారు . అనంతరం ఎన్ సి సి , పలు విభాగాల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతపురం జెఎన్టియు విశ్వవిద్యాలయం దేశంలోనే అగ్రస్థానంలో ఉండేలా బోధన ,బోధనేతర సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కృషి చేయాలని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వ్యాసరచన, వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను, బహుమతులను వీసీ, రిజిస్ట్రార్ ఆచార్య కృష్ణయ్య, ఓ ఎస్ డి వీసీ ఆచార్య దేవన్న, ప్రిన్సిపల్ ఆచార్య సత్యనారాయణ అందజేశారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ.. విభిన్న మతాలు, సంస్కృతులు ఐక్యత స్వరూపం ఇండియాని అన్నారు. విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిగా తీసుకొని.. ఉన్నత వికాసం వైపు అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రెటరీ జోజీ రెడ్డీ, కోఆర్డినేటర్ శారద, ఓటిపిఆర్ఐ సిబ్బంది, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.