Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

అమరవీరుల త్యాగం మరువలేనిది…

ఆదర్శ సేవా సంఘం వ్యవస్థాపకుడు భీమిశెట్టి కృష్ణమూర్తి
విశాలాంధ్ర ధర్మవరం:: అమరవీరుల త్యాగం మరువలేనిదని ఆదర్శ సేవా సంఘం వ్యవస్థాపకుడు భీమిశెట్టి కృష్ణమూర్తి, గౌరవాధ్యక్షులు చెన్నా ప్రకాష్ కార్యదర్శి బుద్ధికి నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆదర్శ పార్కు నందు ఈనెల 13వ తేదీన కాశ్మీర్ అనంత్ నాగ జిల్లాలో జరిగిన ఆపరేషన్ లో వీర మరణం పొందిన కల్నల్ మనప్రీత్సింగ్, మేజర్ ఆశిష్, డిఎస్పి హు మయూన్ బట్, రవికుమార్ ల వీరమరణానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు వీర సైనికులు భారతదేశ ప్రజలను కాపాడుటలో వివిధ రకాలుగా మృత్యుపాలవుతున్నారని, ఇది బాధాకరమైన, దేశానికి వారి త్యాగం, సేవ మనమందరము గుర్తించుకోవాలని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రభుత్వంతో పాటు భారతీయులందరూ కూడా అండదండలుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దండు నాగభూషణ, మారుతి, నాగసముద్రం నాగభూషణ, సురే నాగరాజు, తారకరాం శ్రీనివాసులు, పవన్ కుమార్ తో పాటు ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img