Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పెంచిన భూ రిజిస్ట్రేషన్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా పసంహరించుకోవాలి

. నాలుగేళ్ల పాలనలో ఆరు సార్లు ధరలు పెంచిన సీఎం జగన్
. రాజస్థాన్ లో గ్యాస్ సిలిండర్ 5 వందలు, ఎపిలో 12 వందలు
. సామాన్యుల రక్తాన్ని జలగలా పీల్చేస్తున్న సీఎం జగన్
. పెంచిన ధరలు ఉపసంహరించు కోవాలీ

ఆత్మకూరు మండల కార్యదర్శి సనప నీళ్లపాళ్ల రామకృష్ణ డిమాండ్ విశాలాంధ్ర ఆత్మకూర్ ఏపీలో పెంచిన భూ రిజిస్ట్రేషన్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం భే షరతుగా ఉపసంహరించుకోవాలని సిపిఐ ఆత్మకూరు మండల కార్యదర్శి నీలపాల రామకృష్ణ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి నిత్యావసర వస్తువులు, భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడమే పనిగా పెట్టుకున్నాడని విమర్శించారు. ఇప్పటికే డీజిల్ పెట్రోల్ ధరల్లో పక్క రాష్ట్రాలకంటే ఎపి లో లీటరుకు 10 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎపిలో వ్యాట్ ను విపరీతంగా పెంచారని దీంతో ఆస్తి పన్నులు,ఇంటి టాక్స్ లు, నీరు ,చెత్త పన్నులు, తిండిగింజల ధరలు ఊహించని విధంగా పెరిగిపోయాయని విమర్శించారు. సామాన్య ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో 10 గజాల స్థలం కొనాలంటే రిజిస్ట్రేషన్ చార్జీలకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఏకరువు పెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విపరీతంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపధ్యంలో సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలు కనీసం రెండు పూటలా తిండి తినే పరిస్థితి లేకుండా పోతోందని విరుచుకు పడ్డారు. గ్రామ పంచాయితీలు మొదలుకొని మండలాలు, పట్టణాలు, నగరాల్లో అన్నిరకాల భూములకు ధరలు పెంచి సామాన్యులు కనీసం సెంటు స్థలం కొనే పరిస్థితి లేకుండా చేశారని సీఎం జగన్ పై మండిపడ్డారు. వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలపై పెద్ద ఎత్తున ధరలు పెరిగడమే కాకుండా రిజిస్ట్రేషన్ చార్జీలకు భయపడి ఆయా భూములు, స్థలాలు సామాన్య ప్రజలు కొనే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువులు, సిమెంట్, స్టీలు, ఇసుక ధరలు వూహించని విధంగా పెరిగిపోయాయని దీంతో సామాన్య ప్రజలు అప్పుల పాలౌతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లలో 5 సార్లు ధరలు పెంచిందని జూన్ నెల ఒకటి నుండి మరోసారి భూముల ధరలు పెంచడంతో ప్రజల నెత్తిన గుదిబండ మోపినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్లుగా నాలుగేళ్ల కాలంలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని సామాన్య మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఎన్నాళ్ళు ధరల భారం మోయాలని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. రాజస్థాన్ రాష్ట్రంలో వంట గ్యాస్ సిలిండర్ ధర 5 వందల రూపాయలు ఉంటే ఎపి లో 12 వందల యాభై రూపాయలు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని జగన్ ప్రభుత్వం యధేచ్ఛగా ప్రజలను దోచుకుంటోందని దుమ్మెత్తి పోశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి తక్షణమే పెంచిన రిజిస్ట్రేషన్ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బండారు శివ, గోపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img