సిపిఐ శ్రీ సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్..
విశాలాంధ్ర- ధర్మవరం: రైతుల సమస్యలను పరిష్కరించేంతవరకు పోరాటాలు ఆగవని శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రెస్క్లబ్లో సోమవారం నాడు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి అఖిలపక్ష రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి రమణ అధ్యక్షతన జరిగింది. అనంతరం వేమయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు పదివేలు సాగు సహాయం ప్రభుత్వం అందించాలని వారు డిమాండ్ చేశారు. మోసపూరిత ప్రకటనలతో నేటి వైసిపి ప్రభుత్వం రైతులను మోసం చేయడంతో ఆత్మహత్యలతో రైతులు తమ ప్రాణాల్ని కోల్పోవడం బాధాకరమని తెలిపారు. రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని కేవలం ప్రకటన, ప్రగల్పాలకే ప్రభుత్వం పరిమితమవుతుందని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వాలు అట కేక్కించాయని మండిపడ్డారు. రైతులకు గ్యారెంటీ చట్టం చేసేందుకు ప్రభుత్వాలు వెనువెంటనే చొరువు చూపాలని తెలిపారు. ప్రజలందరికీ ఆహారాన్ని అందిస్తున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలలో చిత్తశుద్ధిలో పిచ్చిందని తెలిపారు. ఆత్మహత్యలు నివారించడానికి రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్న ప్రతి రైతుకు 20వేల వరకు పెట్టుబడి సాయం అందించాలని వారు డిమాండ్ చేశారు. అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, ఉపకరణాలను 90 శాతంతో సబ్సిడీతో ప్రభుత్వం అందించాలని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని ఆలోచనలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఉచిత విద్యుత్తును కొనసాగించే విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల అన్ని రకాల పంట రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని, కేరళ తరహా రుణ ఉపశమనం చట్టం తేవాలని, 50 సంవత్సరాలు పైబడిన రైతు కౌలు రైతులకు ప్రతినెల పదివేల రూపాయలు పెన్షన్ అందించాలని వారు తెలిపారు. దసలవారీగా ఉద్యమ కార్య చరణను ఇప్పటికే రూపొందించామని, తద్వారా ప్రభుత్వాన్ని కదిలించి రైతుల సమస్యలను పరిష్కరిస్తుందేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని తెలిపారు. తదుపరి ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి రమణ, ధర్మవరం నియోజకవర్గ కార్యదర్శి మధు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయని కూడా అనుసంధానం చేయాలని కేరళ తరహాలో రైతు రుణ విముక్తి చట్టాన్ని తీసుకొని రావాలని డిమాండ్ చేశారు.. హంద్రీనీవా కాలువ పనులను వెంటనే చేపట్టాలని, అన్ని పంటలకు వాతావరణ బీమా ను వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రైతు సంఘం నాయకులు ప్రసాద్ నాయుడు, బోయ రవిచంద్ర, రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు మహాదేవు వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి .పెద్దన్న, మండల అధ్యక్షులు మారుతి, శ్రీరాములు, సిపిఐ కార్యదర్శి రవికుమార్,, సహాయ కార్యదర్శి వైవి రమణ, చేనేత కార్మిక సంఘం నాయకులు వెంకటస్వామి జనసేన పార్టీ నాయకులు రేగాటిపల్లి రవి, ముదిగుబ్బ సిపిఐ కార్యదర్శి శ్రీనివాసులు సికేపల్లి కార్యదర్శి నాగరాజు కనగానపల్లి కార్యదర్శి బాలరాజు, ఈశ్వరయ్య, గోవిందు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు పోతులయ్య,, నియోజకవర్గ అధ్యక్షులు శివ, జిల్లా నాయకులు విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.