అనంతపురం – విశాలాంధ్ర వైద్యం : అనంతపురము నగరం లో చైన్ స్నాచింగ్ దొంగతనం చేసిన ఆరు గంటల్లోనే దొంగలు అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ అన్నుబ్ రాజన్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రూ 3.60 లక్షల విలువ చేసే 6 తులాల గల రెండు బంగారు చైన్లు స్వాధీనము చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు
గోర యశ్వంత్, శ్రావణి ఇద్దరు అప్పులు చేసినారాని, సదరు అప్పులను తీర్చుకొనడానికి సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని వారి అపార్ట్మెంట్ లోనే గ్రౌండ్ ఫ్లోరే లో వున్న వృద్ధురాలు మెడలో బంగారు గొలుసులను దొంగలించాలని నిర్ణయించుకొని నిన్నటి దినం అనగా 22 వ తేదీ మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో సదరు వృద్దురాలు ఇంటి ముందర పడుకొని వుండగా ముద్దాయి శ్రావణి సమాచారం ఇవ్వగా యశ్వంత్ నల్లని భుర్జా ధరించి అపార్ట్మెంట్ లోని లిఫ్ట్ నుండి క్రిందకి వచ్చి వృద్ధురాలు ఇంటిలో వారు బయటకు రాకుండా ఇంటి తలుపుకి గడియ పెట్టి మంచం మీద పడుకున్న వృద్ధురాలు మెడలోని రెండు బంగారు గొలుసులను లాకోని అపార్ట్మెంట్ మెట్ల ద్వారా పైకి పరిగెత్తి పోయినాడు.
అనంతపురము జిల్లా ఎస్ పి ఆదేశముల పై అనంతపురము ఎస్డీపీవో శ్రీ వీర రాఘవ రెడ్డి పర్యవేక్షణలో అనంతపురము మూడవ పట్టన్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్, కె . ధరణి కిశోర్, సీసీస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, అనంతపురము నల్గోవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి బృందాలుగా ఏర్పడి దొంగతనము జరిగిన 6 గంటల వ్యవధిలోనే అనంతపురము టౌన్ లోని ఎం ఎం హెచ్ అపార్ట్మెంట్ వద్ద ముద్దాయిని పట్టుకొని అతని వద్ద నుండి చోరీ కాబడిన రెండు బంగారు చైన్లను రికవరీ చేసి అరెస్టు చేయడమైనది.
సి ఆర్ . నెంబర్.40/2024 యూ /స్ 379 ఐపీసీ అఫ్ అనంతపురము III టౌన్ పి .స్ అయినది.
పై ముద్దాయిని అరెస్టు చేయడములో కీలక పాత్ర వహించిన మూడవ పట్టన పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ కె . ధరణి కిశోర్, సీసీస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, అనంతపురము నల్గోవ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ రెడ్డి మరియు వారి సిబ్బంది హెచ్ సి శివయ్య, పి ఎస్ ‘ఎస్.జయరాం, ప్రభు, డబ్ల్యూ పిసి కళావతి, వెంకట సుబ్బమ్మ మరియు సీసీస్ సిబ్బంది బాలకృష్ణ, లతీఫ్ లను రాజశ్రీ అనంతపురము జిల్లా ఎస్ పి అభిన౦దించినారు.