విశాలాంధ్ర – బుక్కరాయసముద్రం: జవహర్లాల్ నెహ్రూ సాంకేతి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య జి. రంగ జనార్ధన వాచ్ మెన్లుకు, స్వీపర్ల కు డ్రస్ కోడ్ పంపిణి చేశారు. అనంతరం వీసీ మాట్లాడుతూ..ప్రతి రోజు ఆఫీసుకు వచ్చేటప్పుడు డ్రస్ తప్పని సరిగా వేసుకొని రావాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచి విశ్వవిద్యాల ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో మీ పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య యం. విజయ కుమార్ , రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ , వీఆర్వో డాక్టర్ యం .రామ శేఖర రెడ్డి , యూనివర్సిటీ డి ఈ రవికుమార్ , యు ఈ యం.డి. అస్లాం పాల్గొన్నారు.