Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కార్మిక హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వం

విశాలాంధ్ర – రాప్తాడు : వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ళ నుండి కార్మిక హక్కులను కాలరాస్తోందని టీడీపీ మండల కార్యదర్శి పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి శ్రీనివాసులు విమర్శించారు. టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు సోమర నారాయణస్వామి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయంలో జెండా ఎగురవేశారు. వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులకు తూట్లు పొడిచారని ఆరోపించారు. జగన్‌ విపరీత పోకడల వల్ల ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని గుర్తుచేశారు. వేలాది మంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టకుండా వ్యవహరిస్తుండడం దారుణమన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఒక్క ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. భవిష్యత్తులో కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గజ్జల నారాయణస్వామి, సర్పంచ్ ఉజ్జినప్ప, నాయకులు ఇంద్రశేఖర్, గేట్ సత్తి, కోట అంజినప్ప, వెంకటేష్, స్వర్ణక్క, నగేష్, కేశవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img