Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

వృద్ధులకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తి ఉంది

బిజెపి నేత సాకే ఓబులేష్

విశాలాంధ్ర – ధర్మవరం:: వృద్ధులకు అన్నదానం చేయడంలో సంతోషంతో పాటు ఎంతో సంతృప్తి కలదని బిజెపి నేత సాకే ఓబులేష్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని గొట్లూర్ అనాధ వృద్ధాశ్రమంలో శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబులేష్ ఆధ్వర్యంలో తన తల్లి సాకే గంగమ్మ జ్ఞాపకార్థం ఆశ్రమంలో వృద్ధులకు వస్త్ర దానంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వన్ టౌన్ ఎస్ఐ మహమ్మద్ రఫీ పాల్గొని, వృద్ధులకు చీరలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ సమాజములో ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఉండాలని, తద్వారా మానవతా విలువలు పెరిగే అవకాశం ఉందన్నారు. అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రఫుల్ల చంద్ర వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు హరి, లక్ష్మీదేవి, ఓబులమ్మ, చిట్టి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img