క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు ( చిట్టి)
విశాలాంధ్ర – ధర్మవరం:: పేద ప్రజలకు వైద్యం అందించుటలో ఎంతో తృప్తి ఉందని క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు( చిట్టి), దేవాలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాదం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు బండి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27వ తేదీ ఆదివారం పట్టణంలోని తొగటవీధిలో శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవాలయం యొక్క ఆవరణములో 90వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. నిష్ణాతులైన డాక్టర్లు వివేకుళ్ళయప్ప, వెంకటేశ్వర్లు, సాయి స్వరూప్, లతాశ్రీ, నాగప్రసాద్ అనే వైద్యులచే ఉచిత వైద్య చికిత్సలను, ఉచిత ఆరోగ్య సలహాలను కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు రెడ్డిపల్లి సుబ్బమ్మ, కీర్తిశేషులు రెడ్డిపల్లి రామప్ప జ్ఞాపకార్థం వీరి కుమారుడు ఆర్. రామచంద్ర, ఆర్. రాజేశ్వరి, ఆర్. సాయి మనోజులు వ్యవహరించనున్నారని తెలిపారు. శిబిరానికి వచ్చువారు గతంలో వైద్యులు ఇచ్చిన రిపోర్టులు కూడా తీసుకొని రావాలని తెలిపారు. వైద్య చికిత్సలను అందించడంతోపాటు నెలకు సరిపడా మందులను కూడా దాతలు చేతులు మీదుగా ఇవ్వడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. కావున పట్టణ, గ్రామీణ పేద ప్రజలు ఈ యొక్క ఉచిత వైద్య చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకొని, ఆరోగ్యం గా ఉండాలని వారు తెలిపారు.