Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

పేదలకు సేవ చేయడంలోనే ఎంతో సం తృప్తి ఉంది

శ్రీ సత్య సాయి సేవ సమితి
విశాలాంధ్ర – ధర్మవరం : పేదలకు సేవ చేయడంలోనే ఎంతో సంతృప్తి ఉందని శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్లు నామా ప్రసాద్, చంద్రశేఖర్, రామకృష్ణ, నారాయణస్వామి, రామాంజి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం 340 మంది రోగులకు భోజనము ప్యాకెట్లను, గర్భిణీలకు స్వీట్ లను ప్రభుత్వ వైద్యులు, నర్సుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులే భరించడం జరిగింది. వారు మాట్లాడుతూ దాతల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నామని వారు తెలిపారు. ఆసక్తి గల దాతలు సెల్ నెంబర్ 9966047044 కు గాని 903044065 కు సంప్రదించాలని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ శ్రీ సత్య సాయి సేవ సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img