శ్రీ జయలక్ష్మి మాత, శ్రీ అన్నపూర్ణేశ్వరి మాత విగ్రహమూర్తుల ప్రతిష్ట
సహస్రచంద్ర భవనం మరియు మూలికా బృందావనం ప్రారంభోత్సవం
మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
విశాలాంధ్ర – రాప్తాడు : మన సృష్టిలో తల్లిని మించిన దైవం లేదని ప్రతి ఒక్కరూ తల్లిని ప్రేమించి పూజించి ధన్యులు కావాలని తల్లి ఏ స్వార్ధము లేకుండా తన బిడ్డలను తన కుటుంబము ఎదగాలని తాపాత్రయపడుతూ జీవించడం జరుగుతుందని దత్త భక్తులందరూ జయలక్ష్మి మాతను పూజించి ధన్యులు కావాలని దత్త పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ మాతృమూర్తి జయలక్ష్మి మాత మరియు అన్నపూర్ణ దేవి వార్ల నూతన విగ్రహ ప్రతిష్ఠను ఇవ్వాళ ఉదయం రాప్తాడు మండలం జయలక్ష్మిపురంలో మైసూర్ దత్త పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ కరకమలములతో శ్రీచక్ర పూజ నిర్వహించి, వేద పండితుల మంత్ర జపలతో ప్రత్యేక పూజలతో జయలక్ష్మి మాత, అన్నపూర్ణేశ్వరి మాత నూతన విగ్రహ మూర్తులను ప్రతిష్టించారు. అంతకుముందు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి చేతుల మీదుగా సహస్ర చంద్ర భవనము మరియు బృందావనం ప్రారంభోత్సవం జరిగింది, భక్తులకు, ఇక్కడి పని వారి కోసం ఆలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం 40 రూములతో సహస్ర చంద్ర భవనం అద్భుతంగా నిర్మించారు. ఆలాగే నూతన బృందావనంలో స్వామిజీ వారు మొక్కలు నాటి, వాటికి నీరును పోసి ప్రారంభించారు. ఈ బృందవనంలో మూలికా వృక్షాలు, పూల మొక్కలు అనేక రకాలైన మొక్కలను నాటించారు. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ 165వ విశ్వధర్మ యాత్రను పూర్తి చేసుకుని జర్మనీ నుంచి నేరుగా జయలక్ష్మిపురంకు వచ్చానని శ్రీ నరహరితీర్థ ఆరాధనకు నన్ను ఆయన రప్పించుకున్నారు, జయలక్ష్మి మాత విగ్రహ మూర్తి నవయవ్వన లలితా దేవిగా ఇక్కడ ఉన్నారని స్వామీజీ అన్నారు. పూజా కార్యక్రమాల తర్వాత అన్నదాన ప్రసాదాలు నిర్వహించారు ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు ఈ పూజ కార్యక్రమంలో ప్రసాద్, రమేష్, వంశీ, సీతరామ్, కాశీ, నాగమణి, అమర్ సింహ, వేద పండితులు, ఎస్.జి.ఎస్ ట్రస్ట్ సభ్యులు, వాలేంటర్లు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.