Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

వాల్మీకులను మోసం చేస్తే సహించేది లేదు

రాష్ట్ర వాల్మీకి సంఘం నాయకులు గోట్లూరు చంద్ర

విశాలాంధ్ర – ధర్మవరం : వాల్మీకులను బోయలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే సహించేది లేదని రాష్ట్ర వాల్మీకి సంఘం నాయకులు గోట్లూరు చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రెస్క్లబ్లో వారు మాట్లాడుతూ వాల్మీకులను ఎస్టిలో చేర్చే విషయం కొత్తేమీ కాదని, 1956 దాకా వాల్మీకి,బోయలు ఎస్టీలగా ఉన్నారు అని, అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి అయినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా ,కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే ప్రాంతీయ వ్యత్యాసాన్ని చూపిస్తూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని జిల్లాలను ముఖ్యంగా రాయలసీమ జిల్లాలను ఎస్టీల నుంచి బీసీ లోకి కన్వర్ట్ చేసి ఏ కమిషన్, ఏ విచారణ,ఏ జీవో లేకుండా రాజ్యాంగ ఉల్లంఘన చేసి, బోయలకు ద్రోహం చేయడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి మర్రి చెన్నారెడ్డి నేతృత్వం వహించినప్పుడు పూర్తిగా వాల్మీకులను బోయలను బీసీ సామాజిక వర్గంలో కలపడం జరిగిందన్నారు. అప్పటినుండి ఇప్పటిదాకా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు 10 కమిషన్లు దాకా వేసి విచారణ చేయడం జరిగిందని వారు తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం తీర్మానాలు పరిగణాలములోకి తీసుకోకుండా, ఏకసభ్య కమిషన్ శామ్యూల్ ఆనంద్ నేతృత్వంలో ఒక కమిషన్ వేసి, కేవలం రాయలసీమలోని నాలుగు జిల్లాలలో మాత్రమే పర్యటన చేయించి మిగతా నాలుగు జిల్లాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు దుయ్య బట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ సాకే మద్దిలేటి, ఏపీ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ సాంబ, జింకల రాజన్న, పూజ మొబైల్ సాయి ,జయరాం, వాల్మీకి నగర బత్తలపల్లి మండల అధ్యక్షులు సాకే గోపాల్, కుర్లపల్లి మోహన్, ముస్తూరు నాగార్జున, పలువురు వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img