రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కృష్ణమూర్తి, రామకృష్ణ
విశాలాంధ్ర – ధర్మవరం : పేద ప్రజలకు సేవ చేయడంలోనే తృప్తి ఉందని రోటరీ క్లబ్ అధ్యక్షులు పి. కృష్ణమూర్తి, కార్యదర్శి బి.రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం పట్టణంలోని కోట మున్సిపల్ పాఠశాలలో రోటరీ క్లబ్బు ఆధ్వర్యంలో, శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా అందత్వ నివారణ సంస్థ- అనంతపురం వారి సహకారంతో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా శంకరా కంటి ఆసుపత్రి కోఆర్డినేటర్…, డాక్టర్ మెరు, కంటి రోగులకు ఉచితంగా పరీక్షలను నిర్వహించారు. అనంతరం కంటి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి తెలియజేశారు. అనంతరం రోటరీ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు- కృష్ణమూర్తి, రామకృష్ణ, క్యాంపు చైర్మన్- నాగభూషణ మాట్లాడుతూ మానవసేవే మా పరమ వదిగా ఇటువంటి కార్యక్రమాలను చేపట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాలలోని వందలాది మందికి కంటి చికిత్సలతో పాటు కంటి ఆపరేషన్లు కూడా చేయించడం జరిగిందని వారు తెలిపారు. శిబిరా దాతలుగా కీర్తిశేషులు చిందులూరు పద్మావతి, కీర్తిశేషులు చిందులూరు సత్యనారాయణల జ్ఞాపకార్థం వీరి కుమారులు మల్లికార్జున, రాఘవేంద్ర, కేదార్నాథ్, వారి కుటుంబ సభ్యులు -సత్య కృపా సిల్క్స్ -ధర్మవరం వారు నిర్వహించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలను తెలిపారు. ఈ శిబిరానికి ప్రత్యేకంగా స్థానిక రిటైర్డ్ కంటి వైద్యాధికారి నరసింహులు రోగులకు కంటి చికిత్సల ను చేసి, కంటిపట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు. ఈ శిబిరంలో మొత్తం 278 మంది రోగులు హాజరుకాగా ఇందులో 192 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక కావడం జరిగిందని, వీరందరికీ బెంగుళూరులో ఉచితంగా కంటి ఆపరేషన్ తో పాటు రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ శిబిరానికి రవాణా సౌకర్యమును ఉచితంగా కల్పించిన దాతలు కీర్తిశేషులు ఉలిక్కిరెడ్డి కుమారులు రామచంద్రారెడ్డి వారి మిత్రులు వ్యవహరించడం జరిగిందన్నారు. దాతలు తోపాటు డాక్టర్ మేరు, శంకర కంటి ఆసుపత్రి కోఆర్డినేటర్ శివ ప్రకాష్ లను రోటరీ క్లబ్ వారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి రత్నశేఖర్ రెడ్డి శివయ్య సోలిగాల వెంకటేశులు సుదర్శన్ గుప్తా పెరుసాల్దాస్ సత్రశాల ప్రసన్న కుమార్ మనోహర్ గుప్తా ఆదర్శ సేవా సంఘం కృష్ణమూర్తి పోస్టల్ నాగభూషణ, రిటైర్డ్ కంటి వైద్యాధికారి డాక్టర్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.