London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ఇంటర్ స్టేట్ అధికారుల మధ్య సమన్వయం ఉండాలి

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సాధారణ లోక్‌సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో ఇంటర్ స్టేట్ అధికారుల మధ్య సమన్వయం ఉండాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. సోమవారం సాధారణ లోక్‌సభ ఎన్నికలు-2024పై గూగుల్ మీట్ ద్వారా ఇంటర్ స్టేట్ బోర్డర్ ఆఫీసర్ల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్ నుంచి ఈ గూగుల్ మీట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం, చిత్రాదుర్గ, తదితర ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల మధ్య ఇంటర్ స్టేట్ కనెక్టివిటీ అత్యంత ముఖ్యమైనదన్నారు. ఎన్నికల దృష్ట్యా అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్, ఆయుధాలు, వస్తువులు, లోహాలు మొదలైన వాటి అంతర్రాష్ట్ర తరలింపుపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ, అనంతపురం జిల్లా సరిహద్దుల్లో నిఘా ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎలక్టోరల్ రోల్‌లో ఓటర్ల డూప్లికేషన్ లేకుండా చూసేందుకు మరియు ఓటర్ల జాబితా స్వచ్ఛతను కాపాడేందుకు రెండు జిల్లాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారుల మధ్య సమన్వయం ఎంతో అవసరమన్నారు. జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దులో స్టాటిక్ చెక్ పోస్టులు, డైనమిక్ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సరిహద్దు ప్రాంతంలో అదనపు చెక్‌పోస్టులు/కాంపోజిట్ చెక్‌పోస్టులు/సర్‌ప్రైజ్ చెక్‌పోస్టుల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సరిహద్దు ప్రాంతంలో ఇబ్బంది కలిగించే వారిని, రౌడీ షీటర్లను గుర్తించి నివారణ నిర్బంధ చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సరిహద్దు చెక్ పోస్టుల వద్ద సీజర్స్ నమోదు చేపట్టాలని, ఎలాంటి అక్రమ మద్యం, డబ్బు, డ్రగ్స్, ఆయుధాలు లాంటి ఇతర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాల్, కంబదూరు, బ్రహ్మసముద్రం, తదితర మండలాల పరిధిలోని ఇంటర్ స్టేట్ బోర్డర్ల పరిధిలో అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. కర్ణాటకలోని సరిహద్దు జిల్లాల అధికారులు కూడా ఇందుకు సహకారం అందించాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ గూగుల్ మీట్ లో కళ్యాణదుర్గం ఆర్డీఓ రాణి సుస్మిత, రాయదుర్గం ఈఆర్ఓ కరుణకుమారి, సెబ్ అడిషనల్ ఎస్పీ జి.రామకృష్ణ, అడ్మిన్ అడిషనల్ ఎస్పి విజయభాస్కర్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, చిత్రదుర్గ జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img