Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

గ్రామపంచాయతీలో అక్రమాలు జరగలేదు

ఏలాంటి విచారణకైనా సిద్ధం

గ్రామ సర్పంచ్ మీనుగా లలిత

ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన నిధులు రూ,88.56 లక్షల తమ వ్యక్తిగత ఖాతాలోకి జమ చేసుకున్నట్లు అంబేద్కర్ సిటిజన్ ఫోరం అనే సంస్థకు కు చెందిన గంగాధర్ లోడి అనే వ్యక్తి తప్పుడు సమాచారాన్ని పత్రికలుకు ఇవ్వడం జరిగిందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ మీనుగా లలిత తెలిపారు. శుక్రవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రామ సర్పంచు, మరియు కార్యదర్శి కి సంబంధించి జాయింట్ అకౌంట్ 35069855200 నెంబరు ఉందని ఈ అకౌంట్ నెంబర్ పైనే లావాదేవీలు జరుగుతాయని అయితే గంగాధర్ లోడీ అనే వ్యక్తి ఇది తన వ్యక్తిగత ఖాతా నంబర్ అని తప్పుడు సమాచారాన్ని పత్రికల వారికి ఇవ్వడం జరిగిందన్నారు. తాను సర్పంచ్ గా ఎన్నికైనప్పటినుంచి పూర్తిస్థాయి నిబంధనలు కనుగుణంగానే బిల్లులు చెల్లింపులు పనులకు సంబంధించిన తీర్మానాలు జరుగుతున్నాయన్నారు. సాధారణ నిధులు జాయింట్ అకౌంట్లో జమ చేస్తారని దీని ద్వారానే చెల్లింపులు జరుగుతాయి అన్నారు. తమపై అవాస్తవమైన ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు ఆమె తెలిపారు. ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో అభివృద్ధి పనులకు సంబంధించి అలాగే బిల్లులు చెల్లింపులు తదితర అనేక అంశాలు నిబంధనలకు లోబడే జరుగుతున్నాయని దీనిపై తాము ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img