Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

వ్యాపారస్తులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

పట్టణ పట్టు చీరల, జెర్రీ వ్యాపారస్తలు, వివిధ సంఘంల డిమాండ్

విశాలాంధ్ర – ధర్మవరం : ఇటీవల విజయవాడ ఆలయ సిల్క్ హౌస్ అధినేత అవినాష్ గుప్తా, వారు అనుచరులు ధర్మవరం వ్యాపారస్తులైన కోటమానంద్ శశిధర్ లపై దాడి చేయడం దారుణమని, వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్షలు పడే విధంగా త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరుతూ ధర్మారం పట్టణ పట్టు చీరల, జరీ వ్యాపారస్తులు, వివిధ సంఘములో వ్యాపారస్తులు, చేనేతలు, భారీ ర్యాలీని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 200 మంది వ్యాపారస్తులు పట్టణంలోని శమీనారాయణ స్వామి దేవాలయం నుండి కాలేజీ సర్కిల్ వరకు తమ నిరసనను తెలుపుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ, తమ దాడికి చేసిన వాటిపై న్యాయం జరగాలన్న నినాదాలు మారుమోగాయి. తదుపరి ఆర్డీవో తిప్పే నాయక్ కు, డిఎస్పి శ్రీనివాసులకు జరిగిన విషయాన్ని తెలియజేసి త్వరితగతిన చర్యలు తీసుకునే విధంగా న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. తదుపరి వివిధ వ్యాపారస్తుల సంఘం నాయకులు మాట్లాడుతూ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా విజయవాడ వ్యాపారస్తులు దాడి చేయడం హేయమైన చర్య అని, భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా చంపుతామని బెదిరించడం, తదుపరి వీడియోలు తీసి ధర్మారం వ్యాపారస్తులను భయాందోళనకు గురి చేసే విధంగా చేయడం అతి దారుణమని తెలిపారు. తాము ఎటువంటి ఆధారాలు లేకపోయినా కొన్ని సంవత్సరాలుగా నమ్మకంతో మా చీరలను అప్పుగా ఇచ్చి తిరిగి నగదును వసూలు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ దాడి ముమ్మాటికి చేనేత పరిశ్రమలు నమ్ముకున్న వారి మనోభావాలను దెబ్బతీయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈ దాడికి నిరసనగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు మాకు మద్దతు తెలపడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీ వారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు బాధితులను పరామర్శించి అండగా ఉంటామన్న భరోసా ఇవ్వడం, మాకెంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు రక్షణ చట్టాన్ని రూపొందించాలని, తగిన చర్యలు కూడా గైకొనాలని వారు తెలిపారు. ఆ రక్షణ చట్టం ఉంటే తమ వ్యాపారాలు సాఫీగా కొనసాగుతాయని తెలిపారు. దాదాపు ఈ ర్యాలీ మూడు గంటల పాటు జరిగింది. కొంతసేపు మాత్రమే ట్రాఫిక్కుకు అంతరాయము కలిగిన కూడా, పట్టణ వ్యాపారస్తులు ప్రజలు సహకరించారు. ఈ కార్యక్రమంలో గిర్రాజు నగేష్, గిర్రాజు రవి, లక్ష్మీనారాయణ (డియల్) కలవల మురళి, కలవల రాంకుమార్, కోటమానంద్, గిర్రాజు శశిధర్, జింక చందు, గడ్డం శ్రీనివాసులు, మెడికల కుళ్లాయప్ప, ఉడుముల రామచంద్ర, పోలా వెంకటరమణ, పోలా ప్రభాకర్, తవిశీల నాగభూషణ రెడ్డి, సిద్ధి రాజు, జాకీర్, పట్టణములోని చిన్న, పెద్ద వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వివిధ సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img