విశాలాంధ్ర అనంతపురం వైద్యం : అరెస్టయిన వీరిలో ఇద్దరు ద్విచక్ర వాహనాలు దొంగలు… ఇంకొకరు చోరీ వాహనాలను విక్రయించే వాడు
** అరెస్టు నిందితుల వివరాలు
1) కుందాని దిన ప్రకాష్, వయస్సు 27 సం లు ఇందిరా నగర్, మదనపల్లి, అన్నమయ్య జిల్లా
- ఆవుల సిద్దార్థ వయస్సు 19 సం లు తండ్రి వెంకట రాముడు, కొత్త బస్ స్టాండ్, నార్పల మండల కేంద్రం (జేసీబీ హెల్పర్)
- సంపతి విజయ్, వయస్సు 30 సం లు భైరవ నగర్, అనంతపురము.( కారు డ్రైవర్)
ప్రస్తుతం అరెస్టయిన వారిలో కుందాని దిన ప్రకాష్ ముఖ్యుడు. ఇతను కూలీ పనుల ద్వారా జీవనం సాగిస్తున్నాడు. ఆవుల సిద్ధార్థ్ ఇతనికి మంచి స్నేహితుడు. జెసిబి కు ఇతను హెల్పర్ గా వెళ్లేవాడు. ఈ ఇద్దరు జల్సాలకు అలవాటు పడ్డారు. రోజు వచ్చే సంపాదన వీరి జల్సాలకు సరిపడేది కాదు. దీంతో డబ్బు సులువుగా సంపాదించాలని భావించారు. టూవీలర్ల దొంగతనాల వైపుమొగ్గు చూపారు. నకిలీ తాళాల సహాయంతో అనంతపురం, నార్పల, పుట్లూరు, బుక్కరాయసముద్రం లలో దుకాణాల ముందు పార్క్ చేసిన వాహనాలను దొంగలించారు. ఇలా చోరీ చేసిన వాహనాలను డంప్ చేసి విక్రయించడానికి సంపతి విజయ్ ను ఉపయోగించారు. కీలక నిందితుడైన కుందాని దిన ప్రకాష్ పై గతంలో తిరుపతి మోటార్ సైకిల్ చోరీ కేసులో జైలుకు పోయి వచ్చాడు.
జిల్లాలో జరిగిన మోటార్ సైకిళ్ళ దొంగతనాలపై ప్రత్యేక శ్రద్ద వహించి ఛేదించాలని జిల్లా ఎస్పీ శ్రీ కె.కె .ఎన్ .అన్బురాజన్ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం టౌన్ డీఎస్పీ జి .ప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఇదే పనిలో నిమగ్నమయ్యింది. అనంతపురము 1 టౌన్ సీఐ వి .రెడ్డెప్ప, ఎస్ ఐ పి.వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది బృందంగా ఏర్పడి రాబడిన సమాచారము మేరకు ఈ దినము ఉదయము కలెక్టర్ ఆఫీసు ఎదురుగా వున్న గోశాల వద్ద అరెస్టు చేశారు. వారు చెప్పిన మేరకు 14 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చేసి 13 లక్షల 70 వేలు విలువ గల 14 ద్విచక్ర వాహనములను స్వాధీనం చేసుకున్న అనంతపురము 1 టౌన్ సీఐ వి .రెడ్డెప్ప ఎస్ ఐ పి . వెంకటేశ్వర్లు మరియు వారి బృందాన్ని జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ అభినందించారు