విశాలాంధ్ర, ఎన్ పి కుంట: మండల పరిధిలోని తూర్పు నడిమిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ పాఠశాలకు వెళ్తున్న సమయంలో మంగళవారం గాండ్లపెంట మండల పరిధిలోని పాయకట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాఠశాల హెచ్ఎం మురళీకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. పాఠశాలకు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా పాయకట్టు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో పాఠశాల హెచ్ఎం మురళీకృష్ణ గాయపడిన సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలకు వెళుతున్న ఉపాధ్యాయులు ప్రమాదాన్ని గుర్తించి 108 వాహనం ద్వారా కదిరి ఏరియా ఆసుపత్రికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ ను తరలించారు. గాయపడ్డ హెచ్ఎం ను మండల విద్యాశాఖాధికారులు గోపాల్ నాయక్, సుబ్బిరెడ్డి లు పరామర్శించారు. తదనంతరం అనంతపురం కి 108 వాహనంలో తరలించడం జరిగింది. ఉన్నత పాఠశాల హెచ్ఎం ను ఉపాధ్యాయులు గంగాద్రి, రామాంజనేయులు, జయకుమార్ నాయక్ , తదితరులు పరామర్శించారు.