Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

నేడు పల్లె ఉమా వర్ధంతి

విశాలాంధ్ర – జేఎన్టీయూ : పేద విద్యార్థుల పెన్నది, సామాజిక, రాజకీయ, సేవ స్ఫూర్తి ప్రదాత అమృత మూర్తి పల్లె ఉమా 5వ వర్ధంతిని పురస్కరించుకొని పల్లె వ్యవసాయ క్షేత్రంలో బుధవారం పల్లె ఉమా ఘాట్ వద్ద శ్రీ బాలాజీ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, టిడిపి మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లె, కిషోర్, పల్లె సింధూర రెడ్డి, మనవడు వియన్, మనవరాలు వన్ష్య, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి పూలమాలవేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం పల్లె ఉమా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు చేయనున్నారు.పల్లె రఘునాథ్ రెడ్డి, కళాశాల చైర్మన్ పల్లె కిషోర్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులు, నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, విద్యార్థులు, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి నివాళులు అర్పించి ,సంతర్పణ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img