Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

కొండాపురం గేట్ క్రాసింగ్ మరమ్మతుల కోసం ఈ నెల 14 నుండి 16 వరకు ట్రాఫిక్ మళ్లింపు

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : గుంతకల్లు రైల్వే డివిజన్ సీనియర్ సెక్షనల్ ఇంజనీర్ జి.రవిబాబు
అనంతపురము, సెప్టెంబర్ 13 : పామిడి నుండి కొండాపురం వరకు కలిపే కొండాపురం గేట్ వద్ద లెవెల్ క్రాసింగ్ పోర్షన్ ట్రాక్ మరమ్మతులు చేయడానికి కల్లూరు-పామిడి సెక్షన్ల మధ్య పి ఎం డి లో ఉన్న కె ఎం -244/42-44 వద్ద ఎల్ సి గేట్ నంబర్- 145 ను 03 (మూడు) రోజుల పాటు అనగా 14/09/2023 నుండి 16/09/2023 వరకు మూసివేయనున్నట్లు గుంతకల్లు రైల్వే డివిజన్ సీనియర్ సెక్షనల్ ఇంజనీర్ జి.రవిబాబు ఒక ప్రకటనలో తెలయజేశారు. కావున, పై మార్గంలో ట్రాఫిక్ మళ్లింపు చేస్తున్న దృష్ట్యా ఆ మార్గంలో వెళ్లే ప్రజలు 14/09/2023 నుండి 16/09/2023 వరకు 03 (మూడు) రోజుల పాటు ఇతర మార్గాల ద్వారా ప్రయానించాలని ఆ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img