విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వీరబ్బాయి అధ్యక్షతన క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లకు జిల్లాలో అమలవుతున్న అన్ని ఆరోగ్య కార్యక్రమాల మీద మరియు ఆయా ఆరోగ్య కార్యక్రమాల ఆన్లైన్ నమోదు ప్రక్రియ మీద 15 రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయ సమావేశ భవనంలో బుధవారం నిర్వహించారు.ఈ శిక్షణ తరగతులను నిపుణులైన వైద్యాధికారులు డాక్టర్ హర్ష, డాక్టర్ రాజేంద్ర, డాక్టర్ అమర్నాథ్ నిర్వహించారు. ఈ శిక్షణా తరగతులు పూర్తయిన తర్వాత మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ లకు జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డా. సుజాత, డా. చెన్నకేశవులు చేత శిక్షణ తరగతుల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారిణి భారతి బాలికల నిష్పత్తి మరియు బేటి పడావో బేటి బచావో ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డెమో త్యాగరాజు, వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.