విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ మండలశీలోని కొండంపల్లి గ్రామంలో కీర్తిశేషులు అమరులు, నిరాడంబరుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇప్పటికి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి దక్కని అవకాశం 14 శాఖలకు మంత్రిగా,ఎంపీగా పనిచేసి ఎన్నో ఉన్నతమైన పదవులో పనిచేసి తెలుగుదేశం పార్టికోసం ఎంతో కృషి చేసిన యస్, రామచంద్రారెడ్డి, బుధవారం జయంతి సందర్బంగా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన సమాధి వద్ద నివాళులర్పించిన తెలుగుదేశంపార్టీరాష్టకార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ మరియు నాగరాజు రెడ్డి , పార్టీ నాయకులు ఆయన చేసిన సేవలను గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం చేసిన కృషిని కొనియాడారు, ఆయన ఎంతోమందికి యువ నాయకులకు రాజకీయ నిర్దేశం చేసిన మహోన్నతమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన లేని లోటు తీరనిదిగా వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని నాయకులు కార్యకర్తలు తెలిపారు,ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సీనియర్ టిడిపి నాయకులు కార్యకర్తలు ఎస్ ఆర్ ఆర్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు.