Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

స్వాతంత్ర ఉద్యమ అమరవీరులకు జోహార్లు

విశాలాంధ్ర -రాయదుర్గం : రాయదుర్గం పట్టణంలో సిపిఐ పార్టీ కార్యాలయంలో 77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాఆవిష్కరించరు.సిపి ఐ.జిల్లా కార్యవర్గ సభ్యులునాగార్జునమాట్లాడుతు బ్రిటిష్ వలస పాలకుల నుండి స్వేచ్ఛాస్వాతంత్ర్యం సాధించుకుని డెబ్బై ఆరేళ్ళు గడిచిన అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదు అన్నారు మానవాభివృద్ధిలో చాలా వెనుకబడి ఉన్నాం. స్వాతంత్ర్య ఫలాలు ప్రజలకు అందలేక. కార్పోరేట్ సంస్థల దోపిడీ భారీగా పెరిగిపోయి బిలియనీర్స్ అధిపతులు గా సంఖ్య పెరిగిపోతున్నారు స్వదేశీ దుష్ట శక్తులు ఆధిపత్యం కోసం సామాజికంగా ఉద్రిక్తతలు సృష్టిస్తూ దేశాన్ని ప్రమాదపు అంచటకు నెడుతున్న ఒకవైపు 77వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొంటున్నాం. మరొకవైపు జాతుల మధ్య విద్వేషం పెచ్చరిల్లి మణిపూర్ తీవ్రసంక్షోభంలోకి నెట్టివేయబడింది. దేశం తలదించుకునే అమానుషమైన ఘటనలు జరిగాయన్నారు పర్యవసానంగా, నేడు దేశంలో పండుగ వాతావరణమే కరువైందన్నారు. విభిన్న జాతులు, తెగలు, మతాలు, కులాలు, బహుళ సంస్కృతులు, సాంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, భిన్నత్వంలో ఏకత్వం మన దేశం యొక్క బలం, ఔన్నత్యం.
భారత రాజ్యాంగం దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు రక్షణ కవచం. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి నేడు చేసిన ప్రసంగంలో మన రాజ్యాంగమే మనకు మార్గదర్శక పత్రం. రాజ్యాంగం పీఠికలో మన స్వాతంత్ర్య పోరాట, ఆదర్శాలు ఉన్నాయా అన్నారు.
మన ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క గొప్పదనం వల్ల స్వాతంత్ర్యోద్యమ వారసత్వంలేని వారు అధికారంలోకి వచ్చారన్నారు.
అనంతరం.స్వాతంత్ర్యోద్యమ అమరవీరులకు జోహార్లు అర్పించారు జెండా ఆవిష్కరించి జాతీయ జెండాకీ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో.సీపీఐ పట్టణ కార్యదర్శి కోట్రెష్ సహాయక కార్యదర్శి గురుస్వామి సీపీఐ నాయకులు నర్సింహులు దుర్గన నగేష్ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img