Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ట్రస్టు సేవలు అభినందనీయం.. ఆర్డీవో తిప్పే నాయక్

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని శ్రీకృష్ణ చైతన్య భక్త భజన మండలి ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆర్డీవోకు ఘనంగా స్వాగతం పలుకు ప్రత్యేక పూజలను ఆలయ కమిటీ చేయించారు. అనంతరం ఆర్డిఓ ను ఆలయ కమిటీ వారు ఘనంగా సత్కరించారు. తదుపరి ట్రస్టు తరపున పేద ప్రజలకు సేవలు చేసేందుకు ఏర్పాటు చేసిన అంబులెన్స్ను వారు ప్రారంభించారు. అనంతరం ఆర్డిఓ తిప్పే నాయక్ మాట్లాడుతూ ఇప్పటికే శ్రీ అవధూత తిక్క స్వామి ఆశ్రమంలో నిత్యాన్నదానం నిర్వహించడం పేదలకు అనాధలకు ఒక వరం లాగా మారిందన్నారు. మా వంతుగా కూడా సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. ఏదైనా అత్యవసర సమయాలలో రోగులను లేదా ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్ లో తీసుకొని వెళ్లడానికి అతి తక్కువ ఖర్చుతో ఈ ఏర్పాటు చేయడం నిజంగా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నాగరాజు, చలపతి, సత్యమూర్తి, దూలప్ప, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img