Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఇద్దరు దొంగలు అరెస్ట్

బ్యాటరీలు, కంప్యూటర్లు స్వాధీనం – వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములో జూన్ 29వ తేదీ రాత్రి లోని కోటలో గల ఉర్దూ పాఠశాలలో దొంగతనం జరిగింది. ఈ కేసును వారం రోజులలో పే వన్ టౌన్ పోలీసులు చేదించడం జరిగింది. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ సుబ్రహ్మణ్యం గురువారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలలో చోరీ విషయాన్ని సీరియస్ గా తీసుకొని, పలు బృందాలుగా విచారణ చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మొదటి మరువ దగ్గర ఇద్దరు ముద్దాయిలైన ఎన్. ముత్యాలు- బడేసాబ్ వీధి ధర్మవరం, ఏ.మాహిస్కాన్- లోని కోట- ధర్మవరం, వీరి ఇరువురిని అరెస్టు చేయడం జరిగిందని వారు తెలిపారు. వీరి వద్ద నుండి ఒక హోండా స్కూటీ, 6 బ్యాటరీలు, ఒక కంప్యూటర్, ఒక ప్రొజెక్టర్, స్పీకర్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి, కోర్టుకు పంపడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి తో పాటు ఉన్నతాధికారులు సీఐ సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్ రాజప్ప, ఉమాశంకర్ లను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img