Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన టూటౌన్ పోలీసులు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని తల్లిదండ్రుల చెంతకు అనంతపురం టూటౌన్ పోలీసులు చేర్చారు. వివరాలు.. స్థానిక ప్రకాష్ రోడ్ లో ఒంటరిగా నిలబడి ఏడుస్తున్న మూడేళ్ల బాలుడిని అటుగా వెళ్తున్న టూటౌన్ హెడ్ కానిస్టేబుల్ రమాదేవి గమనించింది. వెంటనే ఆ బాలుడిని పోలీస్ స్టేషన్ తీసికెళ్లింది. ఆ బాలుడి తల్లిదండ్రుల ఆచూకీపై దృష్టి పెట్టారు. ఆ బాలుడు స్థానిక రహమత్ నగర్ కు చెందిన జబ్బార్ కొడుకు అని తెలియడంతో ఆ తల్లిదండ్రులను పోలీసు స్టేషన్ కు పిలిపించి ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి మరియు డబ్ల్యు హెచ్ సి రమాదేవి పిసి రమాదేవిలు తప్పిపోయిన బాలుడిని అప్పగించారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ ను అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img