విశాలాంధ్ర – పార్వతీపురం: మండల తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టరు బి ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు.బాబాసాహెబ్ డా.బి.ఆర్.అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకొని స్తానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కేకుని కోసి ఆయన జయంతిని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ స్ఫూర్తి ప్రదాతని, రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తని కొనియాడారు. అంబేద్కర్ సమాజానికి దిశా నిర్దేశం చేశారని,అంబేద్కర్ ఆశయసాధనకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈకార్యమంలో మండల పార్టీఅధ్యక్షుడు కొల్లి తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి రౌతు వేణుగోపాల నాయుడు, పెదబోగిలి సర్పంచ్ జొన్నాడ తేరేజమ్మగరికయ్య, రామవరం సర్పంచ్ పెంట సత్యంనాయుడు, సబ్బాన శ్రీను,
వెంకట నాయుడు,సత్యనారాయణ, జొన్నాడ సురేష్ తదితరులు పాల్గొన్నారు.