Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

లంచంతో అనర్హులకు ఇంటి పట్టాలు పై విచారణ చేపట్టండి

సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ – హబీబ్ఊర్ రహిమాన్
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణములో నవరత్నాలను పేదలందరికీ ఇండ్ల పథకంలో పంపిణీ చేయడంలో వార్డు సచివాలయ అధికారులు లంచాలకు ఆశపడి ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా 1000 మందికి పైగా అర్హులకు ఇంటి పట్టాలు కేటాయించడం జరిగిందని వెనివెంటనే విచారణ నిర్వహించి వారందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సమాచార హక్కు ప్రజా చైతన్య వేదిక జిల్లా కన్వీనర్ హబీబ్ ఉర్ రహ్మాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ బండి శేషన్నకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదలకు ఇండ్ల పథకం కింద ఇంటి స్థలం పట్టాలను అప్పగించారని, అయితే ఇంతకు మునుపు ఉన్న కమిషనర్, కొందరు వార్డు సచివాలయ అధికారులు, లంచాలకు పాల్పడి, ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టానుసారంగా పేదలకు చెందాల్సిన ఇంటి స్థలాలను మరొకరికి కేటాయించి మోసం చేయడం జరిగిందని తెలిపారు. ఇంటి పట్టాల పంపిణీలో అన్యాయం జరిగినందున మరోసారి విచారణ చేపట్టి అనార్కుల జాబితాను ప్రకటించి, పేద ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img