Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ఫిట్నెస్ లేని ప్రైవేట్ పాఠశాల బస్సులను సీజ్ చేయాలి… ఎస్ఎఫ్ఐ నాయకులు

విశాలాంధ్ర -ధర్మవరం : ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్డీవో కు వినతి పత్రంను ఎస్ఎఫ్ఐ జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత సిపిఎం పట్టణ కార్యదర్శి నామాల నాగార్జున, జిల్లా ఉపాధ్యక్షులు దామోదర్, జిల్లా కమిటీ సభ్యులు నిరంజన్ సాయి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణం లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు రవాణా శాఖ అధికారుల నిబంధనాలను పెడచెవిన పెట్టి, ఇష్టానుసారంగా కండిషన్ లేని బస్సులు, అదేవిధంగా సీట్ల పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను నడుపుతున్నా రనీ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు ఫీజులు రూపంలో వసూలు చేస్తున్న కొన్ని ప్రైవేటు పాఠశాల బస్సులు మాత్రం విద్యార్థులకు సరైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం లేదనీ. కావున, ధర్మవరం పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాల బస్సులను తక్షణం పర్యవేక్షణ చేసి , అదే విధంగా సీట్ల పరిమితి మించి విద్యార్థులను ప్రయాణం చేయకుండా తద్వారా ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని కోరడం జరిగిందని తెలిపారు. సమస్యలు పరిష్కారం కానీ ఎడల పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img