Monday, September 25, 2023
Monday, September 25, 2023

గుర్తుతెలియని వ్యక్తులు బంకును దగ్ధం చేశారు

ఆదుకోవాలని బాధితుడు ఆవేదన
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కాయగూరల మార్కెట్ ప్రధాన పోస్ట్ ఆఫీస్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కుట్టు మిషన్ గల పెట్టంగడిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బాధితుడు నబి రసూల్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ బంకులో బట్టలు కుట్టు మిషన్ ద్వారా కుడుతూ తన కుటుంబాన్ని పోషించుకునే వాడినని తెలిపారు. నాకు ఉన్న ఒక ఆధారం కూడా వెళ్లిపోయిందని, ప్రతిరోజు 100 రూపాయలు లేదా 200 రూపాయలతో నా కుటుంబాన్ని పోషించుకునేవాన్ని బాధలు వ్యక్తం చేసి, కన్నీటి పర్యంతం అయ్యారు. నా జీవనాధారం వెళ్లిపోవడంతో నేను ఏమి చేయాలో దిక్కు తోచడం లేదని తెలిపారు. ప్రభుత్వము గానీ దాతలు గాని నన్ను ఆదుకొని తిరిగి నాకు పెట్టంగడి ని ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img