విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని యశోద కాన్సెప్ట్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం, శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పృధ్విరాజ్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థి దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దే శక్తి ఒక్క గురువుకే సాధ్యమవుతుందని తెలిపారు. అనంతరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాల చిన్నారులచే శ్రీకృష్ణ వేషధారణ వేయించారు. ఈ వేషధారణ అందరిని ఆకట్టుకుంది. భారతీయ సంస్కృతి కలలను ప్రతి ఒక్కరూ ఆదరించి అందరికీ ఆదర్శంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పృథ్వీరాజ్, ప్రిన్సిపాల్ అనూప్ కుమార్ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.