Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

రాహుల్ అనర్హత వేటు పై కాంగ్రెస్ పార్టీ నిరసన

విశాలాంధ్ర- ఉరవకొండ : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ పై అనర్హత వేటుపై సోమవారం ఉరవకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు వడ్ల అంజనేయులు, సోనియా శీనా, చెన్నప్ప మాట్లాడుతూ భారత దేశం కోసం  ఎన్నో త్యాగాలను చేసిన  రాహుల్ గాంధీ కుటుంబాన్ని నిత్యం అవమానం పరుస్తున్న  కేంద్రంలోని అధికార  బిజెపి అహంకారంతో, నిరంకుషత్వంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో  పారిశ్రామిక వేత ఆదాని చేస్తున్న అక్రమాలపైన, మరియు నరేంద్ర మోడీకి ఆ దానికి ఉన్న సన్నిహిత సంబంధాలపై రాహుల్ గాంధీ గట్టిగా నిలదీయడం జరిగిందని దీనిని జీర్ణించుకోలేని మోడీ ప్రభుత్వం రాహుల్  పై కక్ష సాధింపు  చేస్తుందన్నారు అందులో భాగంగానే అనర్హత వేటు  వేసిందన్నారు. ఇది ప్రజాస్వామ్యం పైనే పెద్ద దాడి అని అభివర్ణించారు. ఇలాంటి సంఘటనలను దేశంలోనే  ప్రజాస్వామ్యవాదులు అందరు కూడా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను దెబ్బతీయడానికి  పరువు నష్టం పేరుతోనూ, సిబిఐ, ఈడి లాంటి రాజ్యాంగ సంస్థలను కూడా స్వప్రయోజనాలకు వాడుకుని  ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు ఇలాంటి నియంతృత్వ విధానాలను అనుసరిస్తున్న బిజెపి పార్టీని తరిమి కొట్టడానికి  ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాలన్నారు రాహుల్ చేసిన వ్యాఖ్యలకు అనర్హత వేటు వేసిన బిజెపి ప్రభుత్వం  ఆ పార్టీలోనే 70 శాతం మంది ఎంపీలు ఇతరుల పరువులకు భంగం   కలిగించే వ్యాఖ్యలు చేశారని వారందరిపై కూడా అనర్హత   వేటు వేయాల్సి ఉంటుందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని  ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడానికి సిద్ధం కావాలన్నారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు అబ్బాస్ అమరనాథ్, చెట్ల రాముడు, పోస రాము, సుధాకర్ వివిధ మండలాలకు చెందిన మండల అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img