విశాలాంధ్ర- జె ఎన్ టి యుఏ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జూన్ 5 నుండి 15 వరకు జరిగే డిగ్రీ పరీక్షలు వాయిదా వేయాలని బుధవారం రిజిస్ట్రార్ ఆచార్య లక్ష్మయ్యకి వినతి పత్రాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుల్లాయి స్వామి, కార్యదర్శి చిరంజీవి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ఏపీలో పీజీ సెట్ పరీక్షలు జూన్ 6 నుండి 10 వరకు నిర్వహిస్తున్న తరుణంలోనే డిగ్రీ పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే విశ్వవిద్యాలయం పనితీరు ఎలా ఉందో ఇలాగే అర్థమవుతుందని అన్నారు. పీజీ ప్రవేశ పరీక్ష రోజునే డిగ్రీ పరీక్షలు చేపడితే పరీక్ష రాసే విద్యార్థి పరీక్ష ఎలా రాయగలడు అన్న విషయాన్ని గమనించకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు..డిగ్రీ పరీక్ష తేదీలను వెంటనే ఉపసంహరించుకుని విద్యార్థులకు ఊరటను కలిగించాలన్నారు. అనంతరం రిజిస్ట్రార్ మాట్లాడుతూ… పరీక్ష తేదీలు మార్పుపై ఉపకులపతి ఆచార్య రామకృష్ణారెడ్డి తో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం వెల్లడిస్తామని తెలిపారు.